కొలంబో టెస్ట్ లో జడేజా రికార్డ్

SMTV Desk 2017-08-06 18:28:32  Jadeja record at colombo, India-srilanka test, Ravindra Jadeja

కొలంబో, ఆగస్టు 6: శ్రీలంకపై జరిగిన టెస్టు సిరీస్ ఇండియా 2-0తో గెలుచుకుంది. ఇండియన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వేగవంతమైన ఎడమ చేతి బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. 32 టెస్ట్ మ్యాచ్‌లలో 150 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ డి సిల్వాను అవుట్ చేసిన తర్వాత జడేజా ఈ రికార్డును సాధించాడు. దానికి ముందు, అతను 149 వికెట్లు తీసుకున్నాడు. తరువాత అతను మొదటి బంతిలో డి సిల్వాను బౌల్డ్ చేశాడు. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ 34 మ్యాచ్‌లలో 150 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అయితే, 29 మ్యాచ్‌లలో 150 వికెట్లు సాధించిన భారత బౌలర్ జాబితాలో ఆర్ అశ్విన్ ప్రధమ స్థానంలో ఉన్నాడు.