రూ. 648 కోట్ల భారీ కాంట్రాక్టును చేజిక్కించుకున్న అనిల్ అంబానీ

SMTV Desk 2019-03-09 16:05:04  anil ambani, Gujarat from the Airport Authority of India to build a new airport at Hirasar,Rajkot district, Reliance Infrastructure Limited E&C

న్యూఢిల్లీ, మార్చ్ 09: అనిల్ అంబానీ రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్ఫ్రా) కంపెనీకి ఓ భారీ కాంట్రాక్టు దక్కింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా హిరసార్‌లో కొత్తగా ఓ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఆ కంపెనీకి రూ. 648 కోట్ల కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆర్‌ఇన్ఫ్రాకు లభించింది. ఈ మేరకు ఆర్‌ఇన్ఫ్రా ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లను అనుసంధానం చేసే జాతీయ రహదారి 8బి సమీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు ఇక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కోసం నిర్వహించిన వేలంలో లార్సెన్ అండ్ టర్బో (ఎల్‌ఖీటీ), దిలీప్ బిల్డ్‌కాన్, గాయత్రీ ప్రాజెక్ట్స్ సహా తొమ్మిది బిడ్డర్లు పోటీ పడగా…వాటిలో అనిల్ అంబానీ కంపెనీ ఈ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది.