తెలంగాణలో ఆదివారం వర్షాలు

SMTV Desk 2019-03-09 13:21:29  telangana , Rains,

హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనితో పాటు వాయవ్య బంగాళాఖాతం నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు దక్షిణకోస్తా, ఒడిసా, కోస్తాంధ్ర, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితలద్రోణి బలహీనంగా మారినట్లు వారు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఆదివారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు. శనివారం పొడి వాతావరణం నెలకొంటుందని వారు చెప్పారు.