వెనిజులాలో చీకటి... కారణం ప్ర‌తిప‌క్ష నేత...

SMTV Desk 2019-03-09 12:52:04  Venevezuela, Caracas, Power Cut, Nicolas Maduro, Juan Guaido

క‌రాక‌స్, మార్చి 9: వెనిజులా దేశంలో చీకటి నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. పవర్ కట్ తో ఆ దేశ రాజధాని క‌రాక‌స్ లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వివిధ పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోవడంతో పూర్తిగా అంధకారంగా మారింది. ఈ పరిస్థితికి ప్రతిపక్ష పార్టీనే కారణమని అధ్యక్షుడు నికోల‌స్ మాడురో ఆరోపించారు. నికోల‌స్ ను పదవి నుండి తప్పించాలని ప్రతిపక్షం చూస్తుందని, అమెరికా, లాటిన్ దేశాల సాయంతో తనను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా వెనిజులాలో రాజ‌కీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో బొలివ‌ర్ రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు ప్లాంట్‌పై ప్ర‌తిప‌క్షాలు దాడి చేయ‌డంతో విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇందువల్ల దేశ‌వ్యాప్తంగా చీక‌ట్లు క‌మ్ముకున్నాయి. క‌రాక‌స్‌లో విమానాశ్ర‌యాన్ని మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు బయటకి పయనమయ్యారు. ప్ర‌తిప‌క్ష నేత జువాన్ గైడో కుట్ర‌కు పాల్ప‌డుతున్నార‌ని మాడురో ఆరోపించారు. మాడురో గ‌ద్దె దిగితేనే మ‌ళ్లీ వెలుతురు వ‌స్తుంద‌ని జువాన్ అన్నారు.