కొండాపై టీఆర్ఎస్ గురి!

SMTV Desk 2019-03-09 12:50:56  Konda Vishweshwar Reddy, Chandrasekhar Rao, Patnam Mahendhar Reddy, Patnam Narendhar Reddy, Ranjith Reddy, MP, TRS, Congress

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల యుద్ధం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న సమయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని తెరాస‌కు గట్టి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కూడా ప‌లు మీడియా వేదిక‌ల‌పై విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెరాస‌పై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం అప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో అత‌నిపై, అత‌ని నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టిని పెట్టారు కేసీఆర్‌. రాబోయే లోక్ సభ ఎన్నిక‌ల్లో చేవెళ్ల నుండి కొండాను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు పన్నుతుంది టీఆర్ఎస్.

కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి పోటీగా అత‌ని బ‌ద్ద శ‌త్రువు మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ఱెడ్డిని రంగంలోకి దింపుత‌ర‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారానికి ఖండిస్తూ కేసీఆర్ కొత్త వ్య‌క్తిని అక్క‌డి నుండి రంగంలోకి దింపుతున్నార‌ని సమాచారం. ఇక్క‌డి నుండి వ్యాపార వేత్త రంజిత్‌రెడ్డిని బ‌రిలోకి దింపుతున్నారు. ఈ విష‌యాన్ని పట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, పట్నం న‌రేంద‌ర్‌రెడ్డిల‌కు కేసీఆర్ ఇటీవ‌ల చెప్పిన‌ట్టు సమాచారం. రంజిత్‌రెడ్డిని గెలిపించే బాధ్య‌త మీద‌ని చెప్పిన కేసీఆర్ మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డిని మాత్రం ఎమ్మెల్సీని చేస్తాన‌ని మాటిచ్చార‌ట‌. ఎమ్మెల్సీగా గెలిచిన ప‌ట్నం న‌రేంద‌రెడ్డి రాజీనామా చేసి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. కొడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించ‌డంతో పార్టీలో ప‌ట్నం సోద‌రుల‌కు ప్రాముఖ్య‌త పెరిగింది.