భారత ఆర్మీ క్యాప్‌ల‌పై.. పాక్ అభ్యంత‌రం

SMTV Desk 2019-03-09 12:20:54  india, australia

హైద‌రాబాద్: రాంచీలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడ‌వ వ‌న్డేలో టీం ఇండియా ఆర్మీ క్యాప్‌ల‌ను ధ‌రించిన గ్రౌండ్ లో దిగింది. దీనిపై పాకిస్థాన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. క్రికెట్‌ను రాజ‌కీయం చేస్తున్న బిసిసిఐపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాకిస్థాన్ స‌మాచార‌శాఖ మంత్రి ఫావ‌ద్ చౌద‌రీ పేర్కొన్నారు.

ఇటీవ‌ల పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 44 మంది సిఆర్‌పిఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పొయారు. ఆ జ‌వాన్ల మృతికి నివాళిగా టీమిండియా జ‌ట్టు రాంచీ వ‌న్డేలో ఆర్మీ క్యాప్‌ల‌ను ధ‌రించింది. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధ‌రించిన అంశాన్ని ఐసిసికి ఫిర్యాదు చేయాల‌ని మంత్రి ఫావ‌ద్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరాడు. ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదని వ్యాఖ్యానించారు.