విపక్షాలన్నీ ఏకమైన మోదీని ఎం చెయ్యలేరు

SMTV Desk 2019-03-09 10:33:26  Prahlad Modi, Narendra Modi, Brother, Koratala Naresh, Kukatpally, Program, Prime Minister

హైదరాబాద్, మార్చి 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, బీజేపీ శ్రేణులను ఉద్దేశించా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ మరోసారి అవే భాధ్యతలు స్వీకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమైనా కూడా నరేంద్ర మోదీ ని ఎం చెయ్యలేరని, మరోసారి ఎన్డీయే సర్కారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అన్నారు. విపక్ష పార్టీలకు ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

కూకట్ పల్లి ప్రాంతంలో బీజేపీ నేత కొరటాల నరేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ చెర నుంచి కాపడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ కు దేశ ప్రజలందరి మద్దతూ లభిస్తోందని ఆయన చెప్పారు.