ఆర్మీ జవాన్ ను ఎత్తుకెళ్ళిన ఉగ్రవాద కిరాతకులు

SMTV Desk 2019-03-09 10:21:40  Army Soldier, Terrorist, Kidnapped, Police, Mohammed Yasin Bhat

్రీనగర్, మార్చి 9: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. సెలవుల్లో ఇంటికొచ్చిన ఓ ఆర్మీ జవాన్ ను ఎత్తుకెళ్ళారు. బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్‌ యాసిన్‌ భట్‌ ఆర్మీలోని లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చారు. యాసిన్‌ పై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. యాసిన్ కు తూపాకి గురిపెట్టి లాక్కెళ్ళారు. ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

అయితే, యాసిన్ అదృశ్యం పై పోలీసులు, ఆర్మీ ఆ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్‌ ఔరంగజేబ్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో ఘోరంగా కాల్చి చంపేశారు. కాగా, బాలకోట్‌ దాడిని ప్రస్తావిస్తూ ఐఏఎఫ్‌ ఓ కవితను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. "ఈరోజు కొందరు(భారత వాయుసేన) సరిహద్దును దాటారు. ఎందుకంటే మరికొందరు(పాకిస్తాన్‌) అన్ని పరిమితుల్ని అతిక్రమించారు" అని కవి బిపిన్‌ అలహాబాదీ రాసిన కవితలో రెండు చరణాలను ట్వీట్‌ చేసింది.