తెలంగాణలో మరో నాలుగు కొత్త మండలాలు

SMTV Desk 2019-03-09 09:49:41  telangana state, new mandals, siddipeta, narayanaravu peta, medchel, mooduchintalapally, mosra, chandooru

హైదరాబాద్, మార్చ్ 08: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మరో నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌ వ్యవస్థీకరించి మొస్రా, చండూరు అనే కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.