బాలాకోట్ ను సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాక్ అనుమతి నిరాకరణ

SMTV Desk 2019-03-09 09:42:29  pakistan governmanet, balakot, pakistan terrorists, indian airforce, media coverage

ఇస్లామాబాద్, మార్చ్ 08: భారత వైమానిక దళాలు పాకిస్తాన్ లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాక్ అనుమతి ఇవ్వలేదు. బలాకోట్ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు చూపుతామని పాక్ తొలుత ప్రకటించింది. దీంతో వీదేశీ మీడియా ఈ ప్రాంతానికి చేరుకొనేలోపుగానే పాక్ మాట మార్చింది. బాలాకో‌ట్ కు వెళ్లకుండానే మధ్యలోనే మీడియాను పాక్ ప్రభుత్వం అడ్డుకొంది. అయితే నిజంగా దాడులు జరిగాయా, లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన విదేశీ మీడియాను పాక్ తిప్పిపంపడం ఇది మూడోసారి కావడం గమనార్హం.