బీసీసీఐ 2018-19 కాంట్రాక్ట్‌

SMTV Desk 2019-03-08 18:15:29  Bcci,

టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ 2018-19 కాంట్రాక్ట్‌ ఇచ్చింది. గ్రేడ్ల రూపంలో ఆటగాళ్లకు కాంట్రాక్టు ఇచ్చింది. ఎ+, ఎ, బి, సి గ్రేడ్లలో ఆటగాళ్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఇందులో ప్రతిభా కనబర్చిన యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కు ‘ఎ’ గ్రేడ్‌ అవకాశం లభించింది.

ఏడాదికి రూ.7 కోట్లు లభించే విభాగం ఎ+. ఎ+ విభాగంలో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. కెప్టెన్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా. గతేడాది ఎ+ గ్రేడ్‌ లో ఉన్న శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లు ఎ+ నుంచి ఎ గ్రేడ్‌ కు స్థానాన్ని కోల్పోయారు. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది.

పుజారా గ్రేడ్‌-ఏలో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ దక్కింది. మహిళల విభాగంలో గ్రేడ్‌ ‘ఎ’ విభాగంలో (రూ.50 లక్షలు)లో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి రూ.10 లక్షలు లభించే గ్రేడ్‌ ‘సి’లో ఉంది.

గ్రేడ్ ఎ+: రూ.7 కోట్లు..

గ్రేడ్‌ ఎ+: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా