ఓరిస్ లో రుచికరమైన తెలంగాణ విందు

SMTV Desk 2017-06-01 17:28:29  orise restaurant, 2 to 6 telangana food celebrations

హైదరాబాద్ జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సంధర్బంగా హైదరాబాద్ నగరంలోని ఓరిస్ రెస్టారెంట్లలో రుచికరమైన తెలంగాణ వంటకాలు నోరూరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. భోజన ప్రియులకు ఇది గొప్ప శుభ వార్త. ఈ నెల 2 నుంచి 6 వరకు బసేరా, ఎస్ డీ రోడ్, సికింద్రాబాద్, జలవిహర్, నెక్లెస్ రోడ్, సైబర్ పెరల్, నౌటంకీగల్లీ, హైటెక్ సీటీలలోని ఆకర్షించే విధంగా తెలంగాణ వంటలు అందుబాటులో ఉంటాయని సంస్థ జనరల్ మేనేజర్ సంజయ్ త్రిపాఠి ప్రకటనలో తెలిపారు. అన్ని తెలంగాణ వంటకాలు ఈ రెస్టారెంట్లో లభిస్తాయన్నారు. ప్రధానంగా అంబలి, మురుకులు, గరిజెలు, కారపు అప్పలు, సర్వపిండి, జోన్నరోట్టే తలకాయకూర, కీమ ముట్టీలు, లివర్ ఫ్రై, మొక్కజొన్న గారెలు, గుర్దాకపురా, భేజా ఫ్రై అందుబాటులో ఉంటాయన్నారు.