కాంగ్రెస్ కు షాక్....మరో ఎమ్మెల్యే రాజీనామా

SMTV Desk 2019-03-08 17:54:08  congress party, congress mla, gujarat, mla jawahar chawda resigned

అహ్మదాబాద్‌, మార్చ్ 08: గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జునాగఢ్‌ జిల్లాలోని మానవదర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన జవహర్‌ చవ్‌డా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌ రాజేంద్ర త్రివేదికి సమర్పించారు. మానవదర్‌ నియోజక వర్గం నుంచి 1990, 2007, 2012, 2017 ఎన్నికల్లో ఎమెల్యేగా చవ్‌డా గెలుపొందారు. అయితే కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్న చవ్‌డా బిజెపిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కున్‌వర్జీ బావలియా కూడా తన పదవికి రాజీనామ చేసి బిజెపిలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆశా పటేల్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే.