హీరో శింబు ఇంట పెళ్లి సందడి!

SMTV Desk 2019-03-08 16:16:53  simbhu, arya, vishal, t. rajendhar

చెన్నై, మార్చి 08: కోలివుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తమిళ హీరో ఆర్య.. హీరోయిన్ సాయేషాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మరోపక్క విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పుడు హీరో శింబు ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలైంది. శింబు సోదరుడు కురలసన్ పెళ్లికి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇతడు తన ప్రేమ కోసం ఇస్లాం మతం కూడా తీసుకున్నాడట. ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం శింబు ఇంట పెళ్లి కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నట్లు కోలివుడ్ టాక్. కురలరసన్ బాలనటుడిగా కొన్ని సినిమాలు చేశాడు.

ఆ తరువాత ఇదునమ్మ ఆలు చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. అయితే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించిన కురలసన్ ఆమె కోసం ఇస్లాం మతంలోకి మారాడు. కురలరసన్ తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ తన కొడుకు ఇష్టాన్ని గౌరవించి ఇస్లాం మతంలోకి మారడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. రాజేంద్ర శివ భక్తుడు కాగా, రాజేందర్ కూతురు ఇలాఖ్య ఇటీవల క్రైస్తవ మతంలోకి మారి వివాహం చేసుకొంది. మరి శింబు తన పెళ్లి వార్త ఎప్పుడు వినిపిస్తాడో చూడాలి!