లింగ మార్పిడి చేసుకొని గర్భం దాల్చాడు ఓ వ్యక్తి

SMTV Desk 2019-03-08 16:13:41  transgender, transgender pregnant, gives birth to child, america, ville simmons, stephen geth

అమెరికా, మార్చ్ 08: అమెరికా టెక్సాస్ నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లింగ మార్పిడి చేసుకుని గర్భం దాల్చాడు. పూర్తి వివారాల ప్రకారం టెక్సాస్ నగరానికి చెందిన విల్లే సిమ్సన్ ఏడేళ్ల క్రితం లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారాడు. విల్లే ప్రియుడు స్టీఫెన్ గేత్‌తో ఏడేళ్ళుగా కలిసి నివసిస్తున్నాడు. వారి ఏడేళ్ల సహజీవనానికి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించాడు విల్లే. అయితే లింగ మార్పిడి చేయించుకున్నంత మాత్రాన పురుషుల్లో గర్భసంచి ఉండదని అందుకే గర్భం దాల్చడం అసాధ్యమని చెప్పారు డాక్టర్లు విల్లేకి. కానీ అనూహ్యంగా విల్లే జీవితంలో డాక్టర్లని సైతం విస్మయానికి గురిచేసే సంఘటన జరిగింది. ఫిబ్రవరి 2018లో అతనికి నెలసరి రావడం ఆగిపోయింది. అనుమానం వచ్చి డాక్టర్‌ దగ్గరకు వెళ్లారు ఆ జంట. విల్లేని పరీక్షించిన వైద్యులు కొన్ని టెస్ట్‌లు రాశారు. అందులో విల్లే గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయింది. గర్భం దాల్చడం కోసం ఏ ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే అమ్మ అయ్యే అవకాశం రావడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. కొంచెం కష్టంగా అనిపించినా చివరికి అతనికి పండంటి మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బాబుకి రోవన్ అని పేరు పెట్టారు.