మార్చ్ 08: గూగుల్ సంస్థ చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ బోలో అనే ఓ యాప్ ను తయారుచేసింది. చిన్నారుల మేధాశక్తిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన ఈ యాప్ ను గురువారం లాంచ్ చేశారు. ఈ యాప్ గూగుల్‌కు చెందిన టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. చిన్నారులు చదివే పాఠాలను ఈ యాప్ అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుతుంది. అలాగే ఈ యాప్‌లో 50 హిందీ, 40 ఇంగ్లిష్ స్టోరీలను అందిస్తున్నారు. వాటిని చిన్నారులు వినవచ్చు. దీంతోపాటు వర్డ్ గేమ్స్ కూడా ఈ యాప్‌లో ఆడవచ్చు. ఈ యాప్ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్‌లోనే లభిస్తున్నది. త్వరలో దీనికి మరిన్ని మార్పులు చేసి పూర్తి స్థాయి వెర్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. కాగా ఈ యాప్ బీటా వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.