ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు

SMTV Desk 2019-03-08 15:39:37  tammnah

హైదరాబాద్, మార్చ్ 08: ఓంకార్ దర్శకత్వంలో హారర్ జానర్ లో వచ్చిన రాజు గారి గది అప్పట్లో చాలా పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓంకార్‌కి ద‌ర్శ‌కుడిగా మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా రాజు గారి గది2 సినిమా తీశారు. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఊపుతో సెకండ్ పార్ట్ లో నాగార్జున‌, స‌మంత వంటి స్టార్స్ తో భారీగా తెరకెక్కించాడు ఓంకార్. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ ఆ సినిమాకు నాగార్జున సమంతల క్రేజ్ కూడా హెల్ప్ అవ్వలేకపోయింది.

రాజుగారి గది2 డిజాస్టర్ అయినప్పటికీ ఓంకార్ మరో సాహసానికి పూనుకున్నాడు, ఆ సినిమాకి సీక్వెల్ గా రాజుగారి గది3 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, అది కూడా అందులో తమన్నాను హీరోయిన్ గా అనుకుంటున్నాడట. అసలే ఫ్లాప్ సినిమా, ఆపై ఫ్లాప్ హీరోయిన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాడో ఏంటో ఓంకార్. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయటానికే ఎవరూ సాహసించరు అలాంటిది ఫ్లాప్ హీరోయిన్ తో ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడంటే ఓంకార్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. మరీ, ఓంకార్ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.