సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

SMTV Desk 2019-03-08 13:39:27  Supreme court, ayodhya case.

న్యూ ఢిల్లీ, మార్చ్ 08: హిందూ ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా సుప్రీం కోర్ట్ అడుగులు వేస్తోంది, అయోధ్య కేసుపై కీలక తీర్పు వెల్లడించింది. అయోధ్య కేసులో చర్చలతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని అభిప్రాయ పడింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ, ముస్లిం వర్గాలతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది, సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎఫ్ ఎమ్ ఐ కరీముల్లాను కమిటీ అధ్యక్షుడుగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అధినేత శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీ రాములును కమిటీ సభ్యులుగా నియమించింది.

సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాలు ఫైజాబాద్ లోనే జరగనున్నాయి, ఈ సమావేశాలకు మీడియాను కూడా అనుమతించారు. మొత్తం సమావేశాలను వీడియో తీయాలని ఆదేశించింది అత్యోన్నత న్యాయస్థానం. ఎనిమిది వారలలో కమిటీ మధ్యవర్తిత్వ చర్చలు పూర్తి చేయాలనీ ఆదేశాలిచ్చింది. మరో నాలుగు వారాలలో కమిటీ పని మొదలెట్టాలని తెలిపింది, మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనే దిశగా సుప్రీమ్ కోర్ట్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి .