జనసేన లోకి ప్రముఖ నిర్మాత ?

SMTV Desk 2019-03-08 13:36:57  Janasena, Bunny Vas,

ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలవుతున్న కారణంగా పార్టీలన్ని తమ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. టిడిపి, వైసిపి పార్టీల పరిస్థితికి వస్తే ఆ పార్టీ నుండి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి జంపింగ్ జపాంగ్ లు జరుగుతున్నాయి. జనసేనాని మాత్రం తన ప్లాన్ ప్రకారంగా సభలను నిర్వహిస్తూ ఒక్కొక్కరిగా తన అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నాడు. ఇదిలా ఉంటే జనసేన తరపున ఓ సిని నిర్మాతకు ఎమ్మెల్యే టికెట్ కన్ ఫర్మ్ అని తెలుస్తుంది.

అతనెవరో కాదు అల్లు అర్జున్ స్నేహితుడు.. అల్లు కాంపౌండ్ నిర్మాత బన్ని వాసు అని అంటున్నారు. పవన్ తో అల్లు అరవింద్ ఆమధ్య ఉన్న గొడవలన్ని సర్ధుకోగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు సపోర్ట్ గా ఉన్నామని సభా ముఖంగానే చెప్పాడు అల్లు అరవింద్. ఇక ఆ కాంపౌండ్ లో పనిచేస్తున్న బన్ని వాసు సిని నిర్మాణంలో ఉన్నాడు. అయితే ఇంతనికి జనసేన తరపున పాలకొల్లు టికెట్ ఇస్తారని తెలుస్తుంది.

మొన్న అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లినప్పుడు అక్కడ అన్ని ఏర్పాట్లు బన్ని వాసు చూసుకున్నాడట. ఇక పవన్ సభలకు బన్ని వాసు సపోర్ట్ గా నిలుస్తున్నాడు. మార్చి 14న రాజమండ్రిలో జరిగే జనసేన ఆవిర్భావ సభని పర్యవేక్షించే 15 మందిలో బన్ని వాసు కూడా ఉన్నాడు. ఆ 15 మందికి దాదాపు సీట్లు కన్ ఫాం అని అంటున్నారు. మొత్తానికి బన్ని వాసు నిర్మాతగానే కాదు పొలిటిషియన్ గా కూడా మారాబోతున్నాడు. మరి అతనికి టికెట్ కన్ ఫామా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.