చరణ్ పుట్టినరోజున బన్నీ ప్రోగ్రాం ఫిక్స్

SMTV Desk 2019-03-08 12:39:37  ram charan, allu arjun, bunny, bunny19, bunny-trivikram

హైదరాబాద్, మార్చి 08: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం కోసమే చాలా కాలంగా బన్నీ గ్యాప్ తీసుకుంటూ వచ్చాడు. ఈ కారణంగానే త్రివిక్రమ్ కూడా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇది వరకు చేసిన రెండు సినిమాలు హిట్ కావడం తో వీరిద్దరి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో సినిమా షూటింగును ఈ నెల 27వ తేదీన ప్రారంభించాలానే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రోజున చరణ్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనను అల్లు అర్జున్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చరణ్ .. బన్నీ మధ్య ఎంతటి అనుబంధం .. ఆత్మీయత వున్నాయనే సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాతో, త్రివిక్రమ్ .. బన్నీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.