కార్ ఎక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-08 12:37:45  Chirumarthi Lingaiah, Komati Reddy Venkata Reddy, Congress, Party Changing Issue, TRS, MLA, Chandrasekhar Rao

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుబెబ్బ తగిలింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గులాబీ జెండా పట్టుకోవడానికి సిద్దమయ్యాడు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను కూడా కలిసినట్లు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఆయన కార్ ఎక్కనున్నట్లు చెబుతున్నారు.

చిరుమర్తి మొదటి నుండి కోమటిరెడ్డి వర్గానికి మంచి మద్దతుదారుగా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇలా పార్టీ మారడంతో కొమటిరెడ్డి బ్రదర్స్ కి గట్టి దెబ్బ తగలనుంది. ఎన్నికల సమయంలో చిరుమర్తికి పార్టీ టిక్కెట్ వస్తుందో రాదో అన్న ఊగిసలాట జరిగినపుడు కోమటి రెడ్డి బ్రదర్సే దగ్గరుండి చిరుమర్తికి టిక్కెట్ ఖరారు చేయించారు. ఇప్పుడు చిరుమర్తి పార్టీ మారడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారో.