స్నాప్‌డీల్‌కు మరో ఎదురుదెబ్బ

SMTV Desk 2017-08-06 15:45:54  snap deal, filpkart, employees resignation

న్యూఢిల్లీ, ఆగస్ట్ 6 : ప్రముఖ ఇ-కామర్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా మేనేజ్‌మెంట్‌ పై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్త పరుస్తూ ఇద్దరు సీనియర్‌ అధికారులు రాజీనామా చేసారు. ఇటీవల ఇ-కామర్స్‌ బిజినెస్‌లో అతిపెద్ద డీల్‌గా భావించిన ఫ్లిప్‌కార్ట్‌తో విలీనానికి స్వస్తి చెప్పిన స్నాప్‌డీల్‌, భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్నాప్‌డీల్‌ 2.0 కొత్త స్ట్రాటజీపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తూ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గంజ్, టెక్నాలజీ (డేటా ప్లాట్ఫాం) వైస్ ప్రెసిడెంట్ అరవింద్ హేడ తమ పదవులకు గుడ్‌ బై చెప్పారు. మొదట ప్రొడక్ట్‌ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ దేశాయ్, ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్, విరాజ్ చటర్జీ, ఐటి అధిపతి గౌరవ్ గుప్తా తమ పదవి నుంచి నిష్క్రమించగా, ఆ తర్వాత ఎంసీజి బిజినెస్ హెడ్ దిగ్విజయ్ ఘోష్, జనరల్ మెర్కండైజ్ బిజినెస్ హెడ్ రాహుల్ జైన్ రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ రాజీనామా చేయడంతో సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.