విజయ్ ని ఇబ్బంది పెట్టిన అభిమానులు

SMTV Desk 2019-03-08 12:27:32  tamil hero, vijay, ilayathalapathy vijay

చెన్నై, మార్చి 08: తమిళ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు. ఆయనతో అవుట్ డోర్ లో షూటింగ్ చేయడమనేది దర్శకులకు సాహసమే అవుతుందని చెప్పాలి. ఆయన షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఆ రేంజ్ లో అభిమానులు అక్కడికి చేరుకుంటూ వుంటారు. వాళ్లు తమ అభిమానాన్ని ప్రదర్శించే తీరు ఒక్కోసారి విజయ్ ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.

ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక కాలేజ్ లో ఈ సినిమా షూటింగును ముగించుకుని విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. కొంతమంది కుర్రాళ్లు తలైవా .. తలైవా అని పిలుస్తూ తమ బైకులతో ఆయన కారును అనుసరించారు. వాళ్లు కారుతో సమానంగా బైకులపై వస్తుండటంతో కంగారు పడిన విజయ్, కారు అద్దం కిందికి దించి .. ఆగిపొమ్మనీ .. వెనక్కి వెళ్లిపొమ్మని సైగ చేశాడు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే అజిత్ కి కూడా ఎదురైన సంగతి తెలిసిందే.