కార్తీ సినిమాలో జ్యోతిక

SMTV Desk 2019-03-08 12:24:33  karthi, jyotika, drushyam, suriya

హైదరాబాద్, మార్చి 08: దక్షిణ సినీ ఇండస్ట్రీలో కార్తీ అంటే బహుశా తెలియని వారుండరేమో. తమిళంతో పాటు తెలుగులోను తన సినిమాలను విడుదల చేసి మార్కెట్ పెంచుకున్నాడు. త్వరలో ఆయన మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో దర్శకుడిగా జీతూ జోసెఫ్ కి మంచి పేరు వుంది.

ఆయన దర్శకత్వంలో అక్కడ తెరకెక్కిన దృశ్యం .. తెలుగుతోపాటు ఇతర భాషల్లోను భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి జీతూ జోసెఫ్ .. కార్తీ హీరోగా ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఇది కూడా వైవిధ్యభరితమైన కథాకథనాలతో సాగే సినిమానే. ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం జ్యోతికను సంప్రదించినట్లుగా సమాచారం. కథ .. తన పాత్రలోని కొత్తదనం కారణంగానే ఈ సినిమా చేయడానికి జ్యోతిక అంగీకరించిందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.