వ్యాపార సంస్థలకు యుఐడీఏఐ ఝలక్!

SMTV Desk 2019-03-08 12:10:59  Aadhar,

న్యూఢిల్లీ, మార్చ్ 08: యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీచేసింది ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వినియోగదారుడి ధృవీకరణ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సంస్థలు నిర్వహించే ప్రతి లావాదేవి దృవీకరణరు 50 పైసలు చెల్లించాలని యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ.20 (పన్నులతో సహా) చెల్లించాలని, ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని యుఐడిఎఐ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఆధార్ రెగ్యులేషన్స్ 2019 ప్రకారం, ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లకు లావాదేవీ చార్జీలలో మినహాయింపు ఇచ్చారు. సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది 15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతో పాటు ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని యుఐడిఎఐ హెచ్చరించింది. ఇకెవైసి వినియోగానికి సంస్థలు ఎక్కువగా ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. యుఐడిఎఐ తాజా నిర్ణయంతో ఇ కెవైసి వినియోగించుకునే సంస్థలపై భారం పడనుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు తీసుకోలేదని, ఇప్పుడు విధించినది నామమాత్రమేనని ఆధార్ సంస్థ పేర్కొంది.