మరింతగా పతనమైన పసిడి ధర

SMTV Desk 2019-03-08 12:09:50  Bangaram, gold,

న్యూఢిల్లీ, మార్చ్ 08: పసిడి ధరలు మరింతగా దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు కూడా పసిడి ధరలు పతనమయ్యాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.360లు తగ్గి 33,070 రూపాయలకు చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ. 520 పతనమై రూ. 38,980 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారంధర రూ.33,070 , 99.5 శాతం స్వచ్ఛత పసిడి ధర రూ. 32,900గా ఉంది.

ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 1,284.77 డాలర్లుగా ఉంది. అదేవిధంగా వెండి ఒక ఔన్స్15.06 డాలర్లు స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, దేశీయంగా నగల వర్తకుల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం వల్ల పసిడి ధర క్షీణిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలపడుతూ వుండటం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతోంది.