'డియర్ కామ్రేడ్' కొత్త పోస్టర్ వైరల్ ...

SMTV Desk 2019-03-08 12:05:32  Dear comrade,

హైదరాబాద్, మార్చ్ 08: గీత గోవిందం .. టాక్సీవాలా విజయాలతో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి జోరుమీదున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా డియర్ కామ్రేడ్ రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందాన నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే టీజర్ ను ఈ నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనున్నారు.

ఈ మేరకు విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు .. ఇప్పడు ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది ...