ఆంధ్రప్రదేశ్ కి రెండు కేంద్రీయ విద్యాలయాలు

SMTV Desk 2019-03-08 12:03:35  Andhra Pradesh,

అమరావతి, మార్చ్ 08: ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడులో ఒకటి, ప్రకాశం జిల్లా కందుకూరులో ఒకటి.. మొత్తం రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, బడ్జెట్ వివరాలను త్వరలోనే కేంద్రం వెల్లడించనుంది.