జనసేన పార్టీ కార్యాలయంలో గోవులకు సేవలందిస్తున్న పవన్!

SMTV Desk 2019-03-08 12:00:13  Pawan Kalyan, Party Office, Shed, Farming

అమరావతి, మార్చి 8: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యవసాయమన్నా, పశు పోషణ అన్నా అమితమైన ప్రేమ అని తెలిసిందే. ఇలా ప్రకృతిని ఇష్టపడే పవన్ సమయం దొరికినప్పుడల్లా స్వయంగా వ్యవసాయం కూడా చేస్తుంటారు. ఇటు గోవులకు కూడా సేవలు చేస్తుంటాడు. అందుకే పార్టీ మూల సిద్ధాంతాలలో సంస్కృతుల్ని కాపాడే సమాజం అంటూ వాటికి పెద్ద పీట వేశారు.

అయితే మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు. నిన్న(గురువారం) సాయంత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే గోమాతలకు మేత వేసి వాటి ఆలనాపాలన గురించి తెలుసుకున్నారు.