కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-03-08 11:47:25  KTR, warangal,

వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో తెలంగాణ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొన్ని సంచలనాత్మకమైన వాఖ్యలు చేశారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, దీనికి అందరు సిద్ధంగా ఉండాలని తెలిపారు… మోడీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. మోడీ పని తీరు ప్రజలకు అర్థమయ్యింది… దేశంలో మోడీ గ్రాఫ్ అంత పడిపోయింది. బీజేపీ కి 150, కాంగ్రెస్ లి 100 సీట్లు రావడం కూడా కష్టమే… అంతేకాకుండా బీజేపీ కి ఎంత వ్యతిరేకత ఉందొ గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. గతంలో పాలించిన కాంగ్రెస్ మీద ప్రజలకు ప్రేమ నమ్మకం రెండు లేవని వారికి కూడా ఇక అసమ్మతి ఉందని అంటున్నారు.

కేంద్రాన్ని ఎవరు పాలించాలి అనేది కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లో ఉందని, మనదగ్గర నుండి 16 మంది ఎంపీ లు ఢిల్లీకి వెళ్తే మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటున్నటువంటి కాలేషావరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తదని కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథ, కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదు. రేపు దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మనం మన పని సక్రమంగా నిర్వహించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.