ఇండియాలో హోండా సివిక్ 2019

SMTV Desk 2019-03-08 11:40:27  honda civic 2019, honda

న్యూఢిల్లీ, మార్చ్ 07: హోండా కార్స్ దాదాపు ఏడు సంవత్సరాల తరువాత భారత్ లో పూర్తిగా కొత్త సివిక్ కారుని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను రూ.17.70 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. హోండా సివిక్ టాప్ మోడల్ వెల రూ.22.30 లక్షల వరకు ఉండవచ్చు. హోండా మొదటిసారి కొత్త జనరేషన్ సివిక్ ని 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. దాదాపు ఏడాది తర్వాత కంపెనీ భారత్ లో ఈ కారుని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ కార్ 10వ తరానికి చెందింది. భారత స్పెసిఫికేషన్లు ఉండే ఈ కార్ లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఇచ్చారు. ఇవి ఆటోమెటిక్, మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్లలో లభిస్తాయి. కొత్త జనరేషన్ 2019 హోండా సివిక్ ఇంధనాన్ని చేసేలా 1.6 లీటర్ DOHC i-DTEC డీజిల్ ఇంజన్ అమర్చారు. ఇది 118 bhp పవర్ తో పాటు 300 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలది. కార్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో కూడా వస్తోంది. ఇది 139 bhp పవర్, 174 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. కార్ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుండగా, పెట్రోల్ ఇంజన్ మాత్రం CVT ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. హోండా కార్స్ ఇండియా కార్ ఇంజన్ ను BS-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. పాత మోడల్ తో పోలిస్తే కొత్త కార్ ఎంతో మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.