పాకిస్తాన్ ముస్లిం దేశం : మసూద్ అజార్

SMTV Desk 2019-03-08 11:37:17  jaish e Chief Masood Azhar, pakistan, india, pulwama attack

ఇస్లామాబాద్, మార్చ్ 07: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ చనిపోయినట్లు కొద్ది రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆయన పాకిస్తాన్ లోని ఓ మీడియాతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పాక్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘నేను చనిపోయినట్లు వస్తున్న వార్తలు వట్టి పుకార్లే.. నేను ఎంతకాలం బతకాలి, ఎప్పుడు చనిపోవాలి అని దేవుడు నిర్ణయిస్తాడు’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ అధికారులు జైషే మహ్మద్‌తో చర్చలు జరిపినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మసూద్ స్పందిస్తూ....‘పాకిస్తాన్ ప్రభుత్వం ఒత్తిడితోనే పనిచేస్తోంది. మసీదులు, ముస్లింలపై పాక్ విచారణను వెంటనే ఆపేయాలి. పాకిస్తాన్ ముస్లిం దేశం. మలాలా వంటి ఉదారవాదుల చేతుల్లోకి పాక్ దేశాన్ని పోనివ్వద్దు. నేను భారత్ జైల్లో ఉన్న సమయంలో నన్ను చిత్రహింసలకు గురిచేశారు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌లో జీహాద్ మొదలు పెట్టాలి’ అని పిలుపునిచ్చాడు.