యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితా 2019లో రామప్ప గుడి...?

SMTV Desk 2019-03-07 18:22:29  unesco world heritage site in 2019, telangana, ramappa temple, kakatiya

మార్చ్ 07: యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితా 2019లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటైన అపురూప శిల్పకళా నిలయం రామప్ప గుడికి అరుదైన గుర్తింపు లభించే అవకాశముంది. ఈ జాబితాలో భారత్ నుంచి పోటీ పడుతున్న స్థలం ఇదొక్కటే కావడంతో కచ్చితంగా చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ ములుగు జిల్లా పాలంపేటలోని ఈ కోవెలలో రామలింగేశ్వస్వామి కొలువై ఉన్నాడు. క్రీస్తుశకం 1213లో సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. వయ్యారాలొలికే స్తంభకన్యలు, నగిషీలు ఈ ఆలయం ప్రత్యేకతలు. దీన్ని నిర్మించడానికి శిల్పి రామప్పకు 40 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం ఈ గుడి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పరిరక్షణలో ఉంది. జైపూర్ సిటీ, రామప్ప ఆలయాల వివరాలను పరిశీలించిన కేంద్రం చివరికి కాకతీయ వైభవంపై మొగ్గూపింది.