ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష

SMTV Desk 2017-08-06 13:24:12  AP Group-3 mains Exam, APPSC group3 mains Exam, panchayith secretary mains exam,panchayat secretary mains exam

అమరావతి, ఆగష్ట్ 6: గత ఏడాది ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-3కి సంబంధించిన ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 50వేల మందికి పైగా అభ్యర్థులకు నేడు, రేపు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో భాగంగా నేటి గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన మొదటి పేపర్ పూర్తి అయ్యింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌కు సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీ ఈ పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తుంది. గ్రూప్-3 పంచాయితీ కార్యదర్శిల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఈ ప్రకటన విడుదల చేసింది.