కాంగ్రెస్ లోకి యువ నాయకుడు ... !

SMTV Desk 2019-03-07 17:21:51  Hardik patel, Congress

హార్ధిక్ పటేల్... గుజరాత్‌లోని పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమానికి తెరలేపిన యువ సంచలన నాయకుడు. అతితక్కువ కాలం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి అందుబాటులో ఉన్ననేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. హార్థిక్ పటేల్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు హాట్ టాపిక్ గా మారాయి

దీంతో గుజరాత్ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాక, ఆ పార్టీ అభ్యర్థిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జామ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

అహ్మదాబాద్ నగరంలో ఈ నెల 12వతేదీన కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనసంకల్ప్ ర్యాలీలో హార్థిక్‌ను సాదరంగా పార్టీలోకి చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. హార్థిక్ పటేల్ చేరికతో యువత, రైతుల్లో కాంగ్రెస్ మద్ధతు పెరగడం ఖాయం అంటున్నారు.

హార్థిక్ పటేల్ కాంగ్రెస్ చేరిక అంశంపై గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ చవడా స్పందించారు. హార్థిక్ పటేల్ చేరికను ఆయన ధృవీకరించారు. పటేల్ వర్గంతోపాటు ముస్లిములు, ఎస్సీలు ఎక్కువగా ఉన్న జామ్ నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పటేల్ పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని అంటున్నారు.