డైలమా లో క్రిష్

SMTV Desk 2019-03-07 17:09:29  Krish, Director Krish,

గమ్యం, వేదం సినిమాల నుండి క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా మంచి విషయాన్ని చెబుతూ వచ్చాయి. అయితే బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేసిన క్రిష్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ ఛాన్స్ అందుకున్నాడు. ముందు తేజ మొదలుపెట్టిన ఈ సినిమాను తన వల్ల కాదని వెళ్లిపోగా క్రిష్ వచ్చి ఎన్.టి.ఆర్ బయోపిక్ పూర్తి చేశాడు. ఎన్.టి.ఆర్ జీవిత కథను రెండు పార్టులుగా తీశాడు క్రిష్.

కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా వల్ల భారీ నష్టం ఏర్పడింది. అయితే ఈ భారమంతా క్రిష్ మీద పడ్డది. ఫైనాన్షియల్ గా కాకుండా పెద్దాయన బయోపిక్ మొత్తం చెడగొట్టారని సగటు ప్రేక్షకుడు అంటున్నాడు. అందుకే దర్శకుడు క్రిష్ కొంత గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నాడట. తర్వాత సినిమా కోసం నిర్మాతలు ఓకే చెబుతున్న ఇప్పుడు తనకి సినిమా తీసే మూడ్ లేదని కొంత గ్యాప్ అవసరమని చెబుతున్నాడట. అంతేకాదు కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. పోయిన సినిమా ఎలాగు ఏమి కాదు కాబట్టి క్రిష్ మరో ప్రాజెక్ట్ ఓకే చేసి దాని మీద వర్క్ అవుట్ చేయడం బెటర్.