రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు కేసీఆర్

SMTV Desk 2019-03-07 16:48:11  ktr

తెలంగాణలో ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ, మన పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు, ఏపీలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణలో రైతుల బాగు కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని ఈరోజున దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. సంక్షేమానికి కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని కొనియాడారు. ఢిల్లీ మెడలు వంచే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉండాలని, శాసించి సాధించుకోవాలే తప్ప, యాచించి కాదని అన్నారు.