మహేష్ బాటలో నాని ..

SMTV Desk 2019-03-07 15:57:46  Super Star mahesh,

హైదరాబాద్, మార్చ్ 07: టాలీవుడ్ హీరో నాని కథానాయకుడిగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా నిర్మితమైంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా అలరించబోతున్నాడు . శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ఇంతకుముందు ప్రకటన విడుదల చేసారు . అదే రోజున చైతూ .. సమంతల మజిలీ థియేటర్స్ కి రానుంది.

అయితే ఏప్రిల్ 25వ తేదీన అనుకున్న మహర్షి మే 9వ తేదీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ ఉండాలనే ఉద్దేశంతో, జెర్సీ ని ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చేసినట్టు సమాచారం. అధికారికంగా వాళ్లు ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది. సోలో రిలీజ్ కోసం జెర్సీ ఏప్రిల్ 19కి వెళితే .. మజిలీ కి కూడా సోలో రిలీజ్ దక్కుతుంది. ఇప్పటివరకూ చైతూకి నాని గట్టి పోటీ ఇస్తాడని అనుకున్నారు .. ఇక అలా జరగదన్న మాట.