రాజశేఖర్ 'అర్జున' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

SMTV Desk 2019-03-07 15:54:47  raasekhar,

హైదరాబాద్, మార్చ్ 07: ప్రముఖ నటుడు రాజశేఖర్ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో అర్జున సినిమా రూపొందింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ .. హ్యాపీ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరియమ్ జకారియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు కీలకమైన పాత్రను పోషించారు. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర.ఇలా రెండు విభిన్నమైన లుక్స్ తో ఆయన కనిపించనున్నారు.

అయితే .. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ద్విపాత్రాభినయం చేయడం రాజశేఖర్ కి కొత్తేమి కాదు .. గతంలో ఆయన రెండు పాత్రలు చేసిన సినిమాలు వున్నాయి. ఎటువన్తి ప్రమోషన్ లేకుండా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.