డబుల్ ధమాకా అంటున్న యువ హీరో

SMTV Desk 2019-03-07 15:49:26  Nithin,

హైదరాబాద్, మార్చ్ 07: జయం సినిమాతో కెరీర్ ఆరంభించిన చాలా ఏళ్ల తర్వాత ఇష్క్ సినిమాతో హిట్టందుకున్నాడు యంగ్ హీరో నితిన్, తర్వాత గుండె జారీ గల్లంతయ్యిందేతో హిట్ అందుకొని మళ్లీ త్రివిక్రమ్ తో అఆ సినిమా వరకు కెరీర్ పడుతూ లేస్తూ వచ్చింది. లై,ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వరుస డిజాస్టర్లతో కథ మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనివాస కళ్యాణం సినిమా రిలీజ్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా నితిన్ తర్వాతి సినిమా గురించి అప్ డేట్ రాలేదు, దీంతో నితిన్ పై అభిమానుల ఒత్తిడి పెరిగింది.

అభిమానుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తాళలేక, ఎట్టకేలకు నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే ఏడాది డబుల్ ధమాకా లాంటి రెండు సినిమాలు వస్తాయని పక్కా రిలీజ్ ఉండబోతోందని, ఇంకా సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని, ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలు తప్పకుండ ఉండబోతున్నాయని తెలిపాడు, వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఆ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ, ఇంకో సినిమా ఏంటన్న వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.