అమెరికాను బీట్ చేసిన భారత్

SMTV Desk 2019-03-07 15:46:32  internet users, data service plans, india gives data on lowest price in world , jio

మార్చ్ 07: ఇంటర్నెట్ సేవలను ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు అందిస్తున్న దేశం ఇండియా. యూకేకి చెందిన కేబుల్‌ అనే వెబ్‌సైట్‌ నిర్వహించిన ఓ సర్వే ద్వారా ప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో అమలవుతున్న అంతర్జాతీయ సేవల ధరలను పోల్చి చూస్తే ఈ విషయం తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్‌ వెబ్‌సైట్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ఒక్క ఇండియా తప్ప మిగితా దేశాలతో పోలిస్తే 1 జీబీ డేటాకు దాదాపు రూ.600 పైనే చెల్లించాల్సివస్తుంది(వారి దేశాల కరెన్సీతో భారత కరెన్సీతో పోలిస్తే). అదే మన దేశంలో ఒక జీబీ డేటాకు కోసం కేవలం రూ.18.50 చెల్లిస్తున్నాం. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో 1 జీబీ డేటాకు ఒక్క డాలరు చొప్పన.. మరికొన్ని చోట్ల అదే డేటాకు దాదాపు 50 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. భారత్‌ లో 2016 లో ముఖేశ్‌ అంబానీ జియో 4జి సేవలు ప్రారంభించారు. జియో వచ్చిన తర్వాత ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్‌ నెట్‌ సేవలు పెరిగాయి. జియోకి పోటిగా అనేక టారిఫ్ లు వచ్చినా.. ఏ మాత్రం పోటి ఇవ్వలేకపోయింది. దాదాపు 430 మిలియన్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఇంటర్‌ నెట్‌ సేవలు వినియోగిస్తున్నారు.

జింబాబ్వే.....1 జీబీ ....75.20 డాలర్లు

అమెరికా.....1 జీబీ....12.37 డాలర్లు

చైనా....1 జీబీ....9.89డాలర్లు

యూకే....1 జీబీ....6.66 డాలర్లు

బంగ్లాదేశ్‌....1 జీబీ....0.99 డాలర్లు

శ్రీలంక....1 జీబీ.....0.87డాలర్లు

పాకిస్థాన్.....1 జీబీ....1.85 డాలర్లు