వెంటాడుతున్న ప్లాప్ సెంటిమెంట్ .. మహర్షి మూవీ హిట్ కొట్టేనా ?

SMTV Desk 2019-03-07 15:44:06  Maharshi, Mahesh Babu,

హైదరాబాద్, మార్చ్ 07: టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి సినిమా విడుదల మే 9కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే, ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా రీషూట్ల వల్ల ఆలస్యం అవుతోందని తెలుస్తుంది. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లు మహేష్ బాబుకు నచ్చకపోవడంతో రీషూట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అసలే రిషూట్ల గురించి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ ను ఇప్పుడు రిలీజ్ వాయిదా అవ్వటం ఇంకా టెన్షన్ కు గురి చేస్తోంది. అభిమానుల టెన్షన్ కు కారణం మే నెలలో మహేష్ బాబు కెరీర్ దారుణమైన డిజాస్టర్స్ ఉండటమే.


మహేష్ బాబు గత చిత్రాలు బ్రహ్మోత్సవం, నిజం, నాని కూడా మే నెలలోనే విడుదలయ్యాయి, అవి ఎంత దారుణమైన డిజాస్టర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ, మహేష్ బాబు అభిమానులు ఆందోళన పడుతున్నట్టుగానే మహర్షి చేదు అనుభవాన్ని మిగుల్చుతుందో లేక విజయం సాధించి కొత్త ట్రెండ్ సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా మహేష్ బాబుకు 25వ చిత్రం కావటం వల్ల ఇటు ప్రేక్షకులు, అటు నిర్మాతలతో సహా మహేష్ బాబు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే మే 9వరకు వేచి చూడాల్సిందే.