మంచినీరుగా భావించి యాసిడ్ తాగి మృత్యువాత పడ్డ బాలిక

SMTV Desk 2019-03-07 15:41:58   Delhi School Girl Dies After Accidentally Drinking Acid, sanjana

న్యూఢిల్లీ, మార్చ్ 07: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారి మంచి నీరు అనుకోని యాసిడ్ తాగి మృత్యువాత పడింది. పూర్తి వివరాల ప్రకారం...ఢిల్లీలోని హర్షవిహార్ ప్రాంతంలోని దీప్ భారతి పబ్లిక్ స్కూలులో సంజన అనే బాలిక నాలుగో తరగతి చదువుతోంది. గురువారం క్లాస్ లో సంజన తన స్నేహితురాలితో కలిసి.. భోజనం చేస్తోంది. ఆ క్రమంలో సంజన వద్ద నీరు లేకపోవడంతో...మరోబాలిక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది. అయితే ఆ బాటిల్ లో ఉంది నీరు కాదు యాసిడ్. ఆ విషయం గమనించక ఆ బాలిక దాన్ని తాగేసింది. అనంతరం బాలిక అరుపులు, కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో బాలికను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ తాగిన సంజన శరీరంలో అంతర్గత గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 304 ఎ కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ అతుల్ కుమార్ చెప్పారు. బాటిల్ తోపాటు యాసిడ్ ను ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించారు.యాసిడ్ బాటిల్ ను పొరపాటున తీసుకువెళ్లిందని బాలిక తల్లి చెపుతోంది. ఈ ఘటన ఢిల్లీ పాఠశాలలో సంచలనం రేపింది.