రామ్ చరణ్ ఖాతాలో మరో ఆల్ టైం రికార్డు

SMTV Desk 2019-03-07 14:18:08  Ram charan, rangasthalam,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిట్టిబాబుగా సమంతా రామ లక్ష్మి గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగస్థలం” సినిమా చేసిన మ్యాజిక్ ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.అసలు ఎవరు ఊహించని రేంజ్లో ఈ సినిమాలో ఒక సరికొత్త రామ్ చరణ్ ని చూపించడమే కాకుండా అద్భుతమైన కథనంతో ఈ సినిమాను తెరకెక్కించడం వలన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు చిట్టిబాబు తన ఖాతాలో మరో ఆల్ టైం రికార్డును వేసేసుకున్నాడు.మొన్న శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాను కూడా స్పెషల్ షోస్ వేయగా ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని విధంగా 1లక్షా 40 వేలు రూపాయలు రెండు స్క్రీన్లకు కలిపి వచ్చింది.ప్రతి సంవత్సరం శివరాత్రి స్పెషల్ గా వేసే ఏ సినిమాకు కూడా ఇంత రాలేదట.అందుకే రామ్ చరణ్ ఖాతాలో మరో ఆల్ టైం రికార్డు చేరిందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.