జయలలితది ముమ్మాటికి హత్యే

SMTV Desk 2019-03-07 14:16:53  jayalalitha, murder

చెన్నై, మార్చ్ 07: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితది సహజ మరణం కాదని తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు హల్వాను తినిపించి హత్య చేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యేనన్న ఆయన, విచారణ సక్రమంగా జరిగితే, అన్ని వాస్తవాలూ బయటకు వస్తాయని చెప్పారు. జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. చివరి రోజుల్లో జయలలితకు చికిత్స చేసిన అపోలో యాజమాన్యానికి రాధాకృష్ణన్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన కొందరిని రక్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని షణ్ముగం సెన్సేషన్‌ కామెంట్స్‌ చేశారు.