డేటా దొంగను ఎందుకు మాయం చేశారు?

SMTV Desk 2019-03-07 14:11:38  Vijayasai Reddy, Chandrababu Naidu, Jaganmohan Reddy, IT Grid, Data Leakage, Telangana

అమరావతి, మార్చి 7: తెలుగు రాష్ట్రాల్లో లో ఐటీ గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ గ్రిడ్స్ సర్వర్లలోని టీడీపీ కార్యకర్తల డేటాను తెలంగాణ ప్రబుత్వం వైసీపీకి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది.

ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లను విమర్శించారు. ఈ సంబంధించిన రుజువులు దొరికాకే తెలంగాణ పోలీసులు విచారణను ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈరోజు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పదిస్తూ, "ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా పోలీసుల దర్యాప్తు మొదలు కాదు. ఎవిడెన్స్ దొరికిన తర్వాతే సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రీ కొడుకులు ఏ తప్పూ చేయకపోతే బట్టలెందుకు చించుకుంటున్నారు. కోర్టు తలుపు ఎందుకు తట్టారు? డేటా దొంగను ఎందుకు మాయం చేశారు?" అని ట్వీట్ చేశారు.