శుభవార్త .. రూ.20 కాయిన్ విడుదల చేయనున్న ఆర్‌బీఐ

SMTV Desk 2019-03-07 13:36:01  20 rupees coin, rbi..

న్యూ ఢిల్లీ, మార్చ్ 07: సామాన్యులకు, వ్యాపారులకు శుభవార్త. ప్రభుత్వం త్వరలో రూ.20 నాణెం విడుదల చేయనుంది. ఈ కొత్త కాయిన్ 12 మూలల్లో ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.10 నాణాన్ని పోలినట్టుగానే రూ.20 కాయిన్ ఉండబోతోంది.. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 10 నాణెంతో పోలిస్తే, కొంతమేరకు ఒకేలా ఉండే కొత్త కాయిన్, 12 అంచులను కలిగివుంటుంది. రూ. 10 నాణెం మాదిరిగానే, రెండు లోహా మిశ్రమాలతో, రెండు రంగుల్లో ఉంటుందని తెలిపింది. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో ఔటర్ రింగ్ 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ లోహాలతో తయారవుతుందని, ఇన్నర్ రింగ్ 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ తో తయారవుతుందని వెల్లడించింది. దీంతో పాటు రూ.1, రూ.2, రూ.5, రూ.10 కొత్త నాణేలను కూడా త్వరలో విడుదల చేయనుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2009 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10 నాణెం విడుదల చేయడం విశేషం. ఆ తర్వాత మరో 13 రకాల్లో రూ.10 నాణేలను విడుదల చేసింది. దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు 14 రకాల రూ.10 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయి.