అమెరికాలో వింత వాతావరణం

SMTV Desk 2019-03-07 13:33:47  thunders, america

కాలిఫోర్నియా , మార్చ్ 07: సుమారు ఐదు గంటలు. పెళపెళమని ఉరుములు.. ఒకటే మెరుపులు. 2200 పిడుగులు. ఇల్లు, ఆఫీసుల్లో ని ప్రజలకి బెరుకులు. ఇదీ, మంగళవారం రాత్రి అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని పరిస్థితి. ఈ ఫొటో ఒక్కటి చాలేమో అక్కడి పరిస్థితి ఏంటో చెప్పేందుకు. దీన్ని ‘అట్మాస్ఫెరిక్ రివర్ ’ అంటారని అమెరికా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే, ప్రవాహాలు దక్షిణంవైపు దూసుకొస్తూ పెద్ద మొత్తంలో తేమను గాల్లో కి పంపుతాయట. దాని వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయట. నిజానికి కాలిఫోర్నియాలో ఇలా జరగడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు.