RRR @ కలకత్తా

SMTV Desk 2019-03-07 13:32:26  RRR, rajamouli, ram charan,

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మూడవ షెడ్యూల్ కు కలకత్తా వెళ్తుందని తెలుస్తుంది.

అక్కడ 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటుందట. ఈ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ కు సంబందించిన సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. రాం చరణ్ కూడా అక్కడ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రాం చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుండగా ఎన్.టి.ఆర్ మాత్రం బందిపోటు దొంగగా నటిస్తున్నాడట.

సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు రాజమౌళి. పరిణితి చోప్రా, అలియా భట్ ల పేర్లు పరిశీలణలో ఉన్నాయి. ఇద్దరు భారీ పారితోషికం అడుగుతున్నారట. త్వరలోనే హీరోయిన్స్ కూడా ఫైనల్ అవుతారని తెలుస్తుంది