గంగూలితో ప్రేమ నిజమే..!

SMTV Desk 2019-03-07 12:42:16  ganguly, nagma

టీం ఇండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి అలనాటి తార నగ్మాతో నడిపించిన ప్రేమాయణం అందరికి తెలిసిందే. అప్పటికే పెళ్లై ఓ అమ్మాయి కూడా ఉండగా నగ్మాతో లవ్ ఎఫైర్ నడిపించాడు సౌరవ్. అప్పట్లో శ్రీకాళహస్తి వచ్చి పూజ కూడా జరిపించారు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్న టైంలో ఆయన కెరియర్ గురించి ఆలోచించి ఇద్దరు విడిపోయారట. తన వ్యక్తిగత విషయాల పట్ల ఎక్కువగా పంచుకోడానికి ఇష్టం ఉండదు అటూనే సౌరవ్ పై తన ప్రేమ వ్యవహారం బయట పెట్టింది నగ్మా.

కేవలం కెరియర్ డిస్ట్రబ్ అవుతున్న కారణం చేతనే గంగూలి, నగ్మా విడిపోయారట. అయితే ఐదు పదుల వయసుకి దగ్గర పడుతున్న నగ్మా మంచి వ్యక్తి దొరికితే తాను పెళ్లికి సిద్ధం అంటుంది. సిని, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నగ్మా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ లో ఆమెకు మంచి పాత్ర ఇచ్చారని తెలుస్తుంది.